‘ఇది రాజమౌళి స్టోరీ కాదే’..RRR సినిమాపై టాలీవుడ్ జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు

0
110

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో SS రాజమౌళి ఒకరు. బాహుబలి, RRR సినిమాలతో పాన్ వరల్డ్ కు జక్కన్న ఎదిగారు. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో రాజమోళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. RRR సినిమాను హాలీవుడ్ డైరెక్టర్లు మెచ్చుకుంటున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటో అని అడగగా ఈ విధంగా సమాధానమిచ్చారు.

RRR ఇంతలా ఆకట్టుకుంటుందని అస్సలు ఊహించలేదు. హాలీవుడ్ ప్రముఖుల నుండి అభినందనలు, పొగడ్తలు రావడం ఎప్పటికి మర్చిపోలేను. బాహుబలికి జపాన్ లో సూపర్ క్రేజ్ వచ్చింది. అలాగే RRR ను మెచ్చుకునే వారి సంఖ్య వందలు, వేలకు పెరుగుతూ పోతుంది. అయితే హాలీవుడ్ ప్రేక్షకులను నా సినిమాలు నచ్చుతున్నాయి. నేను వాళ్ల ధోరణినే అవలంభించడం సరి కాదు. నాకంటూ ఓ ప్రత్యేక శైలి ఉంది. ఇప్పుడు దానిని వదిలిస్తే రెండు పడవలపై ప్రయాణం చేసినట్లు అవుతుందన్నారు.

అయితే సినిమాలో ఎన్ని మార్పులు చేసిన, హంగులు జోడించిన అది రాజమౌళి స్టోరీ కాదే అని అనిపించకూడదు. నేను కథను చెప్పే విధానానికి కట్టుబడి ఉంటాను. అది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూస్తాను అన్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో యాక్షన్ సినిమా తీయబోతున్నారు.