అబార్షన్‌ వార్తలపై సమంత స్పందన ఇదే..

0
99
samantha fan

టాలీవుడ్‌ మోస్ట్‌ రోమాంటిక్‌ కపుల్‌గా పేరు గాంచిన నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి విడాకుల వ్యవహారంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ముఖ్యంగా సామ్‌ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని..ఇప్పటికే రెండు సార్లు అబార్షన్‌ చేయించుకుందని.. పిల్లల్ని కంటే కెరీర్‌కు అడ్డుగా మారుతుందని భావించిందని టాక్.

ఈ విషయం చైతన్యకు నచ్చకనే ఇద్దరు విడిపోయారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. పిల్లల విషయంలో నాగ్‌ కుటుంబం సమంతకు ఎంతో నచ్చచెప్పిందని.. కానీ ఆమె వినలేదనే వార్తలు కూడా వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఈ పుకార్లపై సమంత తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. తాను అబార్షన్‌ చేయించుకున్నానే వార్తల్ని ఖండించారు. ఈ క్రమంలో సామ్‌ ఇన్‌స్టాలో ఓ స్టోరీ షేర్‌ చేశారు. ‘‘ఇలాంటి కఠిన సమయంలో మీరు చూపిన ఆదరణకు ధన్యవాదాలు. నాకు మద్దతుగా నిలిచి.. నాపై వచ్చిన అబద్దపు వార్తలని ఖండించారు. ‘వాళ్లు’ నాకు వేరే వాళ్లతో అఫైర్స్‌ ఉన్నాయని..నేను పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. అబార్షన్‌ చేయించుకున్నానని.. నేను అవకాశవాదినని ఇలా రకరకాల వార్తలు ప్రచారం చేశారు.

కానీ విడాకులు తీసుకోవడం అనేది అత్యంత బాధాకరమైన అంశం. దీని నుండి బయటపడటానికి సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో నాపై వ్యక్తిగతంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తగదు. అయితే ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను.. ఈ తప్పుడు ప్రచారం నన్ను ఏమాత్రం కుంగదీయలేదు’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు సమంత.

ఈ పోస్ట్‌ చూసిన సమంత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి తప్పుడు వార్తలపై తప్పక స్పందించాలి సామ్‌.. ఇక ఇన్నాళ్లు నీ మీద రాళ్లు వేసినవారు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.