Video: రెబల్ స్టార్ కృష్ణంరాజు చివరి డ్యాన్స్ ఇదే..

0
106

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో సినిమా లోకాన్ని విషాధచాయలు అలముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్ లో సోమవారం పూర్తయ్యాయి.

కాగా కృష్ణంరాజు తన కెరీర్ లో ఎన్నో పాత్రలు చేశారు. హీరోగా, విలన్ గా, సపోర్ట్ క్యారెక్టర్లు చేశారు. ఆయన లేరని వార్త అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. ఆయనను స్మరించుకుంటూ అభిమానులు ఆయనకు సంబంధించిన విషయాలను వెతుకుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా కృష్ణంరాజు డాన్స్ వీడియో ఒకటి నెట్టింట వైరల్​గా మారింది. ప్రభాస్ మిర్చి సినిమా ఆడియో ఫంక్షన్​లో స్టేజ్​పై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ యాహూ యాహూ బోలో యాహూ యాహూ పాటకు కృష్ణంరాజుతో స్టెప్పులేయించారు. కృష్ణంరాజు కూడా ఎంతో ఉత్సాహంగా చిందులేస్తూ కనిపించారు. అయితే ఆయన చివరిగా వేసిన డ్యాన్స్​ అని తెలుస్తుంది

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=NTVQbDqqpqU&feature=emb_title