వరుణ్ తేజ్ ‘గని’ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

0
109

మెగా ప్రిన్స్ వ‌రున్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘గని’. బాక్సింగ్ నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో స‌యి మంజ్రేక‌ర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్రబృందం. కాగా ఈ సినిమాకు థ‌మ‌న్‌ సంగీతం అందించారు.

తొలుత ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది చిత్ర బృందం. భీమ్లానాయక్ సినిమా అదే రోజు విడుదల కావడంతో..విడుదల వాయిదా వేశారు. ఆ త‌రువాత మార్చి 18న గని  విడుద‌ల చేయ‌బోతున్నార‌ని ప్ర‌క‌టించారు. కానీ ఆ తేదీ కూడా తాజాగా వాయిదా పడింది.

తాజాగా కొత్త తేదీని ప్ర‌క‌టించింది చిత్ర బృందం. ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్టు మేకర్స్ తెలిపారు. బాక్సింగ్ నేప‌థ్యంలో శ‌క్తిమంత‌మైన యాక్ష‌న్ మూవీగా అల‌రిస్తుంద‌ని చిత్ర బృందం పేర్కొంది. ఇటీవ‌లే విడుద‌ల చేసిన టీజ‌ర్‌, పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు న‌టిస్తున్నారు.