మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ ఇదే..

0
98

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబర్‌ 10న జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇప్పటికే తమ ప్యానల్ సభ్యులను ప్రకటించారు అభ్యర్థులు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల వివరాలు చూద్దాం.

ప్రకాష్ రాజ్ ప్యానల్ లో జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్, వైస్ ప్రెసిడెంట్ గా బెనర్జీ, వైస్ ప్రెసిడెంట్ గా హేమ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌‌గా శ్రీకాంత్- జనరల్ సెక్రెటరీగా జీవిత రాజశేఖర్ ఉన్నారు.

అలాగే ప్యానల్ సభ్యులుగా శ్రీకాంత్, ఉత్తేజ్, అనసూయ-అజయ్-భూపాల్-బ్రహ్మాజీ-ఈటీవి ప్రభాకర్-గోవింద్ రావు-ఖయ్యుం-కౌశిక్-ప్రగతి-రమణారెడ్డి-శ్రీధర్ రావు-శివారెడ్డి-సమీర్-సుడిగాలి సుధీర్-సుబ్బరాజు-సురేష్ కొండేటి-తనీష్-టార్జాన్ ఉన్నారు.