టికెట్స్ రేట్స్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందన ఇదే..

This is the reaction of megastar Chiranjeevi on ticket rates.

0
84

సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు వీలుగు శుక్రవారం జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నిర్ణయంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ కోరికను మన్నించి కేసీఆర్ సత్వరమే నిర్ణయం తీసుకోవడం పట్ల మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు.

నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యానికి న్యాయం జరిగేలా టికెట్ ధరలను సవరించడం ఆనందంగా ఉందన్నారు. థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు చేసే నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

మరోవైపు చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఆచార్య మూవీని కంప్లీట్ చేసిన చిరు భోళా శంకర్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయవుతున్నాడు.

https://twitter.com/KChiruTweets?