సౌందర్య సినిమాల్లో ఎక్స్పోజింగ్ కు నో చెప్పడానికి కారణం ఇదేనట

-

నటి సౌందర్య సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా ఆమె పేరు సంపాదించుకున్నారు, అతి తక్కువ సమయంలో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు, తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో నటించారు ఆమె, నటి సావిత్రి తర్వాత అంత ప్రత్యేకమైన గుర్తింపు పేరు ఆమె సంపాదించారు. కుటుంబ కథా చిత్రాలు అంటే వెంటనే దర్శక నిర్మాతలు హీరోయిన్ గా సౌందర్యనే సెలక్ట్ చేసేశారు, అంతేకాదు అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్నారు నటి సౌందర్య.

- Advertisement -

దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు ఆమె…సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు. ఇప్పటికీ నటన విషయంలో మార్కులు వేయాలి అంటే సావిత్రి సౌందర్యని పోలుస్తూ హీరోయిన్స్ కు మార్కులు వేస్తారు అంటే వారు నటనతో ఎంత మంచి పేరు సంపాదించారో అర్దం చేసుకోవచ్చు.

తనకు పోటీగా అప్పట్లో చాలా మంది అగ్ర హీరోయిన్లు గ్లామర్ షో చేస్తూ దూసుకుపోతున్నా సౌందర్య మాత్రం అస్సలు ఎక్స్ పోజింగ్ చేయలేదు… ఏ సినిమాలో కూడా హద్దులు దాటలేదు. అప్పుడప్పుడూ నడుము చూపించడం వరకు ఓకే కానీ అంతకుమించి ఒక్కసారి కూడా హద్దు దాటలేదు… అయినా ఆమె ఇమేజ్ అలాగే ఉంది, అయితే ఆమె నటి ఆమనితో చాలా సన్నిహితంగా ఉండేవారు, ఆమె గురించి ఇటీవల ఆమని ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు.

ఓరోజు తాము ఇద్దరమే షూటింగ్లో ఉన్నపుడు.. ఎక్స్పోజింగ్ గురించి అడిగానని చెప్పారు ఆమని. దానికి వెంటనే ఇలా ఎందుకు చేయాలి రేపు వివాహం అయిన తర్వాత భర్తతో ఈ సినిమాలు చూస్తాం.. పిల్లలతో చూస్తాం.. మన ఫ్యామిలీతో సినిమా చూస్తాం.. వారికి ఎలా ఉంటుంది అందుకే నేను ఇవి చేయను అని చెప్పిందట ఆమె

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | మహాకుంభమేళా మరో శతాబ్దానికి పునాది : మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) మహాకుంభా మేళా నిర్వహణలో ఏదైనా లోపాలు...

MLC Kavitha | SLBCపై రివ్యూ ఎందుకు చేయలేదు సీఎం: కవిత

ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సీఎం రేవంత్ రెడ్డి...