ఉదయ్ పూర్ ప్యాలెస్ లో మెగా డాటర్ నిహారిక వెడ్డింగ్ ఈరోజు రాత్రి జరుగనుంది, అయితే ఇప్పటికే మెగా హీరోలు అందరూ అక్కడకు చేరుకున్నారు, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, బన్నీ, శిరీష్ ,వెంకట్, సాయిధరమ్ తేజ్, వరుణ్, కల్యాణ్ దేవ్ ఇలా అందరూ అక్కడకు చేరుకున్నారు, సంగీత్ మొహందీ ఈవెంట్ లు అదరగొట్టారు, అయితే రెండు రోజుల ముందు అక్కడ మెగా కుటుంబానికి ఏర్పాట్లు చేశారు.
ఇక ప్యాలెస్ ను ఎంతో అందంగా తీర్చిదిద్దారు, నిహారిక- చైతన్య జంట కొత్త దుస్తుల్లో మెరిసిపోతున్నారు..కోవిడ్ నిబంధనల వల్ల కేవలం 100 మంది అతిథులు మాత్రమే హాజరవుతున్నారని తెలిసింది. నిహారిక కొంతమంది ఫ్రెండ్స్ ని మాత్రమే ఇక్కడకు ఇన్వైట్ చేసింది.
అయితే చిత్ర సీమ నుంచి హీరోయిన్లు కొందరికి మాత్రమే పిలుపు వెళ్లిందట, మరి ఇద్దరు ముద్దుగుమ్మలు ఇక్కడకు వచ్చారు, వారు ఎవరు అంటే.. హీరోయిన్ తెలుగమ్మాయి రీతు వర్మ.. హైదరాబాద్ లోనే సెటిలైన ఉత్తరాది బ్యూటీ లావణ్య త్రిపాఠి.
ముందు నుంచి వీరిద్దరితో నిహారికకు మంచి బాండింగ్ ఉంది, ఇక లావణ్య నిహారిక జిమ్ కు కలిసి వెళతారు అనేది తెలిసిందే.