దిగ్గజ గాయని లతా మంగేష్కర్ నేడు హఠాత్తుగా అనారోగ్య సమస్యలతో అకాల మరణం పొందారు. 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించిన లతా మంగేష్కర్ కి చిన్నప్పటి నుండి సంగీతం అంటే ఎంతో మక్కువ ఉండేది. ఇక తండ్రి దీనానాథ్ తో కలిసి పలు నాటకాల్లో నటించిన ఆమెకు, సంగీతంలో మంచి శిక్షణ కూడా ఇప్పించడం జరిగింది. కుటుంబంలోని పిల్లలందరిలోకి పెద్ద అయిన లతా గారు, తన సోదరుడు మరియు సోదరీమణులు ఎంతో ప్రేమగా, ఆప్యాయతతో చూసుకునేవారట. ఇక పెరిగి పెద్దయ్యాక సింగర్ గా1942లో ‘కితి హాసల్’ అనే మరాఠీ మూవీలో ‘నాచు యా గదే అనే సాంగ్’ ద్వారా ఆమె సినిమా రంగప్రవేశం చేసారు. ఆ తరువాత 1945లో ‘బడిమా’ అనే బాలీవుడ్ సినిమాలో ‘జనని జన్మభూమి’ అనే హిందీ సాంగ్ ద్వారా ఎంటర్ అయ్యారు.