గంగవ్వకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అఖిల్  ఏమిటంటే

-

బిగ్బాస్ నాల్గో సీజన్లో  పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ మంచి ఫేమ్ సంపాదించుకున్నారు… ముఖ్యంగా గంగవ్వ గురించి ఎంత చెప్పినా తక్కువే ఉన్నది కొన్ని రోజులు అయినా అందరికి బాగా దగ్గరైంది గంగవ్వ, ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె అనారోగ్య  కారణాలతో బయటకు వచ్చింది, తన పల్లెకు వెళ్లిపోయింది, అయితే గుడ్ న్యూస్ ఏమిటి అంటే  ఇక మరి కొన్ని వారాల్లో ఆమె సొంత ఇంటి కల నెరవేరనుంది.
 బిగ్ బాస్ ఇచ్చిన నగదు అలాగే నాగార్జున సార్ ఇచ్చిన నగదుతో ఆమె ఇళ్లు నిర్మించుకుంటుంది.ఇక గంగవ్వ హౌస్ లో ఉన్నంత సేపు అఖిల్ సార్థక్ను ప్రేమగా అఖిలూ అని పిలిచేది, ఆమెని ఎంతో బాగా చూసుకునేవాడు అఖిల్, అయితే తాజాగా గంగవ్వ అఖిల్ ఇంటికి వెళ్లింది. సరదాగా అఖిల్ను తీసుకుపోయేందుకు వచ్చానంటూ అతడి కుటుంబ సభ్యులతో చెప్పుకొచ్చింది.
ఇక గంగవ్వ  ఇంటికి రావడంతో అఖిల్ చాలా ఆనందించాడు…గంగవ్వ  కోసం పట్టీలు తీసుకురమ్మన్నాడు అఖిల్ మదర్ ని… దీంతో అవ్వ ఇష్టపడే డిజైన్లో పట్టీలు కొనుక్కొచ్చారు. ఇలా గంగవ్వకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు అఖిల్ . మొత్తానికి అఖిల్  గంగవ్వకు ఇచ్చిన గిఫ్ట్ గురించి అందరూ సూపర్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...