ఇది నేనెప్పుడూ ఊహించలేదు..ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమిళ హీరో

This is what I never expected..Tamil hero who made interesting comments

0
117

తమిళ కథానాయకుడు ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ధనుష్​​ హాలీవుడ్‌లో ‘ది గ్రే మ్యాన్‌’ చిత్రం చేస్తున్నారు. ప్రముఖ దర్శకులు రస్సో బ్రదర్స్‌ తెరకెక్కిస్తున్నారు. రియాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఎవాన్స్‌, అనా డి అర్మాస్‌, జెస్సికా హెన్విక్‌ తదితర హాలీవుడ్‌ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

తాజాగా ఈ చిత్ర అనుభవాలను ధనుష్ తెలిపారు​. “ఇంత గొప్ప సినిమాలో భాగమవుతానని నేనెప్పుడూ ఊహించలేదు. నాకు ఇది ఆసక్తికర అవకాశం. ఈ చిత్రంతో నటుడిగా నేనెన్నో కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశమొచ్చింది. అందుకే ఈ ప్రయాణం నాకు చాలా నచ్చింది. త్వరలో తిరిగి చిత్రీకరణలో పాల్గొంటా” అని అన్నారు​.

“నేనెప్పుడూ అవకాశాల వెంటపడలేదు. నా వద్దకు వచ్చినవి వచ్చినట్లు నిజాయితీగా చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ప్రయాణం ఎక్కడికి దాకా వెళ్తుందన్నది దేవుడిపై ఆధారపడి ఉంది. ఆయన ఏ వైపు నడిపిస్తే ఆ వైపు వెళ్తానని చెప్పుకొచ్చారు.