నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు, సినీ ప్రముఖులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఏడడుగులూ నడిచారు. రాత్రి 8:13 గంటల శుభముహూర్తాన వీరి వివాహం జరిగింది. తెలుగింటి సాంప్రదాయాలను అనుసరించి వీరి వివాహ వేడులను జరిపారు. ఈ ప్రత్యేక వేడుకను ఉద్దేశించి అక్కినేని నాగార్జున(Nagarjuna) తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ క్షణం రెండు కుటుంబాలకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు.
“ఈ పెళ్లి మా కుటుంబానికి చాలా గొప్ప క్షణం. చై, శోభిత.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వారి సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం, కుటుంబం, స్నేహితుల ప్రేమతో నా హృదయాన్ని ఎనలేని ఆనందం, కృతజ్ఞతతో నింపుతోంది. ఇది ప్రేమ, సంప్రదాయం, ఐక్యత యొక్క వేడుక, ఇది మా నాన్న కోసం నిలబడిన విలువలను ప్రతిబింబిస్తుంది. కుటుంబం, గౌరవం, ఐక్యత మనందరికీ చాలా సంతోషకరమైన క్షణం, దానికి సాక్ష్యమివ్వడం నిజంగా ఆశీర్వాదంగా భావిస్తున్నాము” అని నాగార్జున(Nagarjuna) పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.