రెండు రోజుల నుంచి మెగా డాటర్ నాగబాబు కుమార్తె వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు చూస్తున్నాం, అయితే రాజస్ధాన్ లోని ఉదయ్ పూర్ లో 9 వ తేదిన వివాహం జరుగనుంది, ఇప్పటికే మెగా అల్లు ఫ్యామిలీలు అక్కడకు చేరుకున్నారు, అయితే ఇప్పుడు మరో టాప్ హీరో ఇంట కూడా పెళ్లి సందడి జరుగుతోంది.
నందమూరి వంశంలో పెళ్లి కొడుకు అవుతున్నారు ఒకరు. అక్కడ బాలయ్య బిజీగా ఉన్నాడు.
నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లోనే డిసెంబర్ 6న ఘనంగా జరిగింది. మొత్తం నందమూరి వారి కుటుంబ సభ్యులు అందరూ అక్కడకు వచ్చి వారిని ఆశీర్వదించారు.
కేవలం కుటుంబ సభ్యుల మథ్య మాత్రమే ఈ ఫంక్షన్ జరిగింది,ఇక నటుడిగా కూడా ఆయన చేశారు
2003 సంవత్సరంలో జగపతిబాబు హీరోగా వచ్చిన ధమ్ సినిమాలో చైతన్య కృష్ణ మరో హీరోగా నటించాడు. కాని ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.. దీంతో ఆయన సినిమాలు ఇక చేయలేదు, రాజకీయంగా కూడా పెద్దగా ముందుకు రాలేదు, బాలయ్య బాబు మిగిలిన నందమూరి హీరోలు ఈ ఫంక్షన్ కు వచ్చారు.