ఓ ప్రముఖ నిర్మాత బడా సినిమా ప్లాన్ చేస్తున్నాడు, అయితే ఇందులో ఓ ఐటెం సాంగ్ ఉంటుందట, ఈ సాంగ్ కోసం ఓ అందాల తారని మాట్లాడారట.. అయితే ఆమె ఎక్స్ పోజింగ్ పాత్రలు చేయను అని ముందు నుంచి చెబుతోంది, కాని ఆమెకు సినిమాకి ఇచ్చేది 60 లక్షలే ,అయితే ఈ సినిమాలో కేవలం సాంగ్ చేయడం అలాగే ఎక్స్ పోజింగ్ చేస్తే ఆమెకు ఏకంగా కోటిన్నర ఇస్తాం అనే ఆఫర్ వచ్చింది..
అయితే ఆమె మాత్రం పదికోట్లు ఇచ్చినా ఆ పాత్రలు ఆ పాటలు చేయను అని చెప్పిందట, దీంతో మరో బ్యూటీ కోసం వెతుకుతున్నారు, సినిమాకి ఆ సాంగ్ కీలకం అని అందుకే ఆమెని సంప్రదించారట, కాని ఆమె మాత్రం నో చెప్పింది.
మరో ముంబై భామని ఈ పాట కోసం చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి, అయితే ఆమె రెమ్యునరేషన్ ఏకంగా మూడు కోట్లు అడుగుతోందట, మరి ఆ నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి, ఈ వార్త అయితే సినిమా వరల్డ్ లో చక్కర్లు కొడుతోంది.