ఈ ఏడాది మెగాహీరోకి పెళ్లి ఎవ‌రో తెలుసా ?

ఈ ఏడాది మెగాహీరోకి పెళ్లి ఎవ‌రో తెలుసా ?

0
76

మెగా హీరోలు టాలీవుడ్ లో ఏడాదికి నాలుగు ఐదు సినిమాల‌తో అభిమానుల‌ని ఖుషీ చేస్తూ ఉంటారు, ఇక చిరు కూడా రీఎంట్రీ ఇవ్వ‌డం ప‌వ‌న్ కూడా సినిమాల్లో మ‌ళ్లీ యాక్టీవ్ అవ్వ‌డంతో ఇక మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు, ఇక మెగా హీరోకి పెళ్లి అంటే ఎవ‌రు అనుకుంటున్నారా, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సాయితేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజాగా తేజూ దీని గురించి కొన్ని హింట్స్ ఇచ్చారు, ఆయన ఇంట్లో పెళ్లి సంద‌డి ఏడాది ఉంటుంద‌ట‌.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజూ మాట్లాడుతూ, తనకు 33 ఏళ్లు వచ్చేశాయని… పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు గొడవ చేస్తున్నారని చెప్పాడు. మొత్తానికి ఇప్పుడు వ‌ద్దు అన్నా ఊరుకోవ‌డం లేద‌ని,అంటున్నాడు.

అన్నీ సెట్ అయితే ఈ ఏడాది నా పెళ్లి ఉండ‌చ్చు అని క్లారిటీ ఇచ్చాడు తేజూ, పెళ్లి సంబంధాల కోసం ఇంట్లో వాళ్లు అదే పనిలో ఉన్నారని చెప్పాడు. మొత్తానికి మెగా హీరోకి అన్నీ సెట్ అయి‌తే ఏ ఏడాది మ్యారేజ్ అవుతుంది, మ‌రి చూడాలి వీరి ఇంటికి వ‌చ్చే అందాల భామ ఎక్క‌డ ఉందో.