ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుండగా, ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది. . దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 2020 జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ఇదివరకే వెల్లడయింది..
అయితే ఈ సినిమా ని తన సొంత బ్యానర్ లో నిర్మించాలనేది ఎన్టీఆర్ ఆలోచన అట.. ఈ సినిమా ద్వారా త్వరలోనే నిర్మాత కూడా మారబోతున్నాడని సమాచారం. తన తండ్రి హరికృష్ణ అలాగే తనయుడు భార్గవ్ పేరు కలిసి ఉండేలా ‘భార్గవ్ హరి ప్రొడక్షన్’ అనే పేరుతో ఈ నిర్మాణ సంస్థ రూపొందనుందని తెలుస్తుంది. దాదాపు ఈ పేరు ఖరారైపోయినట్టు ఎన్టీఆర్ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది