మూవీ : నేను లేని నా ప్రేమకథ
నటీనటులు : నవీన్ చంద్ర, గాయత్రి ఆర్ సురేష్, క్రిష్ సిద్దిపల్లి, అదితి మైకేల్, రాజా రవీంద్ర తదితరులు..
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ : S.K.A భూపతి
డైలాగ్స్ : షబ్బీర్ షా
దర్శకుడు : సురేష్ ఉత్తరాది
నిర్మాత : కళ్యాణ్ కందుకూరి, డా. భాస్కర్ రావు అన్నదాత
విడుదల తేదీ : 08 అక్టోబర్,2021
నవీన్ చంద్ర, గాయత్రి ఆర్ సురేష్, క్రిష్ సిద్దిపల్లి, అదితి మైకేల్, రాజా రవీంద్ర తదితరులు నటించిన సినిమా నేను లేని నా ప్రేమకథ. సురేష్ ఉత్తరాది దర్శకత్వంలో బ్యూటిఫుల్ లవ్ స్టొరీ గా తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆలరించగా సినిమా పై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.చిన్న సినిమా లకు మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో ఈరోజే ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా అలరించిందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే,
నాలుగు క్యారెక్టర్స్ మధ్య జరిగే ఒక మంచి ప్రేమకథే నేను లేని నా ప్రేమకథ. కృష్ణ అనే ఓ కుర్రాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి డిఫరెంట్ డిఫరెంట్ పరికరాలను కనుగొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా కృష్ణ ఒక టైం మిషన్ కనిపెడతాడు. ఆ టైం మిషన్ తో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్స్ లతో కనెక్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా ట్రై చేస్తూ ఉన్నప్పుడు గతం లో ఒక హ్యామ్ రేడియో తో కనెక్ట్ అవుతాడు. అప్పటికే ఆ రేడియో ను ఓ ప్రేమ జంట వాడుతూ ఉంటారు. అలా తన టైమ్ మిషన్ తో ఆ ప్రేమజంట ను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు.. అది ఎలాంటి పరిస్థితులకు దారితీసింది అనేదే ఈ సినిమా కథ
నటీనటులు:
ఇక నటీనటుల విషయానికి వస్తే, నవీన్ చంద్ర నటన ప్రేక్షకులను బాగానే మెప్పించింది అని చెప్పాలి.. సరికొత్త యాంగిల్ లో మనం నవీన్ చంద్ర ను ఈ సినిమాలో చూడవచ్చు. కృష్ణ పాత్ర లో హీరో క్రిష్ చాలా బాగా ఒదిగిపోయాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్ గా లుక్ అదిరిపోయింది. నటనా పరంగా కూడా నవీన్ చంద్ర తో సరిసమానంగా నటించాడు. గాయత్రి ఆర్ సురేష్ రాధ పాత్ర కు చక్కగా సరిపోయింది. మలయాళం అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయి లా కనిపించి మంచి అభినయాన్ని ప్రదర్శించింది. గ్లామర్ పరంగా హీరోయిన్ అదితి సినిమా కు బాగానే ఉపయోగపడింది. ఇప్పటి తరం అమ్మాయి లా బాగా అలరించింది. రాజా రవీంద్ర తమ తమ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పవచ్చు. ఎమోషనల్, లవ్ సీన్స్ లో హీరో హీరోయిన్స్ మంచి నటన కనపరిచారు.
సాంకేతిక నిపుణులు:
ఇక ఈ సినిమా మా కథ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నటీనటులను డైరెక్ట్ చేయడంలో సురేష్ ఉత్తరాది నూటికి నూరు శాతం విజయాన్ని అందుకున్నాడు అని చెప్పాలి. దర్శకుడు ఒక సరికొత్త కథను రాసి ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ కలుగజేశాడు.. ఈ సినిమాలో డైలాగులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలోని లవ్ సీన్స్ లోని డైలాగులు.. క్యారెక్టర్ల మధ్య సంభాషణలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులను అబ్బురపరిచాయి.. సంగీతం చాలా బాగుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే ప్రవీణ్ పూడి కష్టాన్ని ఈ సినిమా ఫలితం రూపంలో చూడవచ్చు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది.
ప్లస్ పాయింట్స్
కథ
నటీనటులు
డైరెక్షన్
స్టోరీ
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ స్లో అవడం
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం
మొత్తానికి ప్రేమకథ, టైం ట్రావెలింగ్ సినిమా లను ఇష్టపడే వారిని ఈ చిత్రం తప్పక మెప్పిస్తుంది. సరికొత్త రిఫ్రెష్ ఫీలింగ్ ను కలుగచేస్తుంది. ఈ సినిమా ను ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్ గా ఈ సినిమా ఒక మంచి కుటుంబ ప్రేమకథా చిత్రం. అందరూ తప్పకుండా కుటుంబం తో చూడదగిన సినిమా.
రేటింగ్ : 3/5