ఆరోజు ఎగ్జైటింగ్ న్యూస్ చెబుతా: మంచు విష్ణు

Today the Big News would say: Snow Vishnu

0
98

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు తమ ప్యానెల్ మేనిఫెస్టో అమలుపై ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. ఇటీవలే మహిళా ఆర్టిస్టుల భద్రత కోసం కమిటీ ప్రకటించిన మంచు విష్ణు తాజాగా మరో బిగ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు.

అక్టోబరు 31న ఓ ఎగ్జైటింగ్ న్యూస్ చెబుతానని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది ‘మా’కు సంబంధించిన విషయమని, చాలా పెద్ద వార్త అని తెలిపారు. ఇటీవల ‘మా’ ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు తన ప్యానెల్ తరఫున అనేక హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయడమే తన తక్షణ కర్తవ్యమని ప్రమాణస్వీకారం సందర్భంగా వెల్లడించారు. ప్రత్యర్థి ప్యానెల్ రాజీనామాలను ఆమోదించని మంచు విష్ణు ప్రకాశ్ రాజ్ వర్గం కూడా తనకు సహకరించాలని కోరారు.

ఎన్నికల సమయంలో మంచు విష్ణు ఈ హామీలు ఇచ్చారు. ‘మా’ భవనాన్ని తన సొంత డబ్బుతో కడతానని హామీ ఇచ్చారు. ఇప్పటికే మూడు స్థలాలు చూసామని, వాటిలో సినీ పెద్దలతో చర్చించి ఒక దాన్ని సెలెక్ట్ చేసి కడతామని, భవిష్యత్తులో కూడా ఉపయోగపడేలా ‘మా’ భవనం కట్టడం.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న కొందరు సభ్యులు సినిమాల్లో నటించడానికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మా యాప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క ‘మా’ సభ్యుల పోర్ట్ ఫోలియో అందులో ఉంచుతామని, మా యాప్ నిర్మాతలకి, దర్శకులకి, రచయితలకి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌కి అందుబాటులో ఉండేలా చూస్తామని, దీని వల్ల మా సభ్యులకి సినిమాలు, ఓటిటి వంటి వివిధ మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయడం.