టాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూత తరలివస్తున్న సినీ ప్రముఖులు

టాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూత తరలివస్తున్న సినీ ప్రముఖులు

0
72

టాలీవుడ్ ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి, ఒకరి తర్వాత మరొకరు సీనియర్లు కాలం చేస్తున్నారు, తాజాగా మరో యువ నటుడు టాలీవుడ్ లో మంచి స్ధాయికి ఎదుగుతున్న సమయంలో ఈ లోకం విడిచి వెళ్లిపోయారు, దీంతో తెలుగు పరిశ్రమ మరింత విషాదంలో మునిగిపోయింది, ఇటీవల వేణుమాధవ్ మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది ఈ సమయంలో మరో యువ నటుడు మరణించారు.

ప్రముఖ నటుడు, రచయిత జాన్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. కేరళకు చెందిన జాన్ హైదరాబాద్లోని కూకట్పల్లి, ప్రగతినగర్లో ఉంటున్నారు. నిన్న రాత్రి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. నేడు ఆయన భౌతికకాయాన్ని స్వస్థలం కేరళ తరలిస్తారు. తనకు సినిమాలు అంటే ఫ్యాషన్ అని చెబుతూ ఉండేవారు.. అందుకే అక్కడ నుంచి ఇక్కడ సినిమాల్లోకి వచ్చారు, ఆయనకు మంచి రోల్స్ కూడా వచ్చాయి, ఇటీవల వచ్చిన పలు సినిమాలు ఆయనకు మంచి ఫేమ్ తీసుకువచ్చాయి.

ఫలక్నుమా దాస్, మను, రక్తం, యుద్ధం శరణం తదితర చిత్రాల్లో నటించిన జాన్.. చివరిసారి గాడ్ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఆయన లేరు అనే వార్త తట్టుకోలేకపోతున్నారు సినిమా ప్రజలు, జాన్ మరణవార్తను దర్శకుడు సాయి రాజేశ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో జాన్కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన మరణవార్త తెలిసి టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్శకుడు సాయి రాజేశ్, నటుడు సత్యదేవ్, నటి గాయత్రీ గుప్తా తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

టాలీవుడ్ మరో మంచి నటుడ్ని ఈరోజు కోల్పోయింది అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు, అయితే ఎలాంటి కోచింగ్ ట్రైనింగ్ లేకుండా నటనలో హవభావాలు పలికించిన నటుడు జాన్ అని చెబుతున్నారు ఫ్రెండ్స్. 40 ఏళ్ల వయస్సులో సినీ ఫీల్డ్లోకి అడుగుపెట్టిన ఆయన.. ఫలక్నుమా దాస్ చిత్రంతో మంచి పేరు గడించారు.