టాలీవుడ్ నటుడి పరిస్థితి విషమం- హెల్త్ బులెటిన్ విడుదల

0
70

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్యనారాయ‌ణ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. తాజాగా కైకాల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజుల ముందు ఆయ‌న ఇంట్లో జారిప‌డి హాస్పిట‌ల్‌లో చేరారు. ఆరోగ్యం కాస్త కుదుట‌ప‌డింద‌ని అనుకున్న స‌మయంలో ఇప్పుడు మ‌ళ్లీ మ‌రోసారి ఆయ‌న అనారోగ్యంతో ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యారు కైకా స‌త్య‌నారాయ‌ణ‌. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, ప్ర‌తి నాయ‌కుడిగా, క‌మెడియ‌న్ ఇలా అన్నీ ర‌కాల ప్రాత‌ల‌ను పోషించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు.