ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, తెలుగు నటి సంధ్యారాజు(Sandhya Raju)కు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ‘ఎట్ హోమ్’ వేడుకల్లో పాల్గొనాలంటూ ఆమెకు ఆహ్వానం లభించింది. సంధ్యారాజు ‘నాట్యం’ సినిమాతో అరంగేట్రం చేశారు. తన తొలి సినిమాతోనే ఆమె రెండు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆమె కేవలం నటిగానే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా కూడా భారతీయ సాంస్కృతిక రంగంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారామే. ఇదిలా ఉంటే రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో నిర్వహించే ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు, మిలటరీ అధికారులు సహా ఇతర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులు పాల్గొంటారు.
సంధ్యారాజు(Sandhya Raju).. తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పీఆర్ వెంకట్రామరాజా కుమార్తె. హైదరాబాద్‌లోని నిశృంఖల డ్యాన్స్ అకాడమీ, నిశృంఖల ఫిల్మ్ ఫౌండర్‌గా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తన నృత్యంతో ప్రపంచ ఖ్యాతి సాధించారామే.