టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన హయత్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీరామ్ నగర్ కాలనికి చెందిన మరిగంటి కార్తీక్ కుమార్ చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని పనిచేస్తుండేవాడు. అయితే ఈ నెల 14 వ తేదీన కార్తీక్ కుమార్ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్ళాడు.
కానీ ఆ తర్వాత ఫోన్ చేసిన కలవక పోవడంతో..కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. ఇంతలోనే 17 వ తేదీన జీవీఆర్ క్రికెట్ అకాడమీ వద్ద కార్తీక్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు చుట్టుముట్టాయి.