టాలీవుడ్ హీరోలు అందరూ మరో కీలక నిర్ణయం

టాలీవుడ్ హీరోలు అందరూ మరో కీలక నిర్ణయం

0
92

టాలీవుడ్ అంటేనే సినిమాలతో ఎప్పుడూ బిజీ సెట్స్ పై పది సినిమాలు కచ్చితంగా ఉంటాయి, అయితే ఇప్పుడు కరోనా దెబ్బకి సినిమా షూటింగులు అన్నీ ఆగిపోయాయి.. దాదాపు నెల రోజులు షూటింగ్ గ్యాప్ వచ్చింది, ఇది మంచి సీజన్.. అయితే ఇప్పుడు ఈ నెల రోజుల వల్ల విడుదల అయ్యే సినిమాలకు పెద్ద ఇబ్బంది వచ్చింది.

ఇక షెడ్యూల్స్ రిలీజ్ డేట్స్ మార్చుకున్నారు, నిర్మాతలకు కూడా ఇది లాస్ అనే చెప్పాలి, అయితే ఇప్పుడు టాలీవుడ్ హీరోలు చాలా వరకూ సంవత్సరానికి ఒక సినిమా చేస్తున్న వారు ఇక ఏడాదికి రెండు సినిమాలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారట.

ఎందుకు అంటే ఈ నెల వల్ల దాదాపు ప్రొడక్షన్ డైరెక్షన్స్ వర్కులు మూడు నెలల వెనక్కి వెళ్లినట్లు వారు భావిస్తున్నారు.. అందుకే కాస్త విరామం ఎక్కువ కాకుండా పది రోజులు తీసుకుని మళ్లీ కొత్త సినిమా స్టార్ట్ చేయాలి అని ప్రతీ హీరో భావిస్తున్నారట, వచ్చే మూడు సంవత్సరాలు సినిమాల విడుదల ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు సినిమా పెద్దలు, అంతేకాదు ఈ సమయంలో దర్శకులు కొత్త కధలు కూడా వినిపిస్తున్నారట, పలు కథలు నచ్చి సినిమాలు ఒకే చేసుకుంటున్నారట.