విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేయనున్న టాలీవుడ్ హీరోయిన్..

0
107

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా రూపొందుతుందని కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తుంది. లైజర్ సినిమా కారణంగా షూటింగ్ కారణంగా ఆలస్యం కావడంతో..ప్రస్తుతం ఈ సినిమా పట్టాలెక్కించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కధానాయకిగా సమంతను తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ నెల 21వ తేదీన  ఉదయాన్నే పూజా కార్యక్రమాలుు చేసి.. అనంతరం సినిమా లాంఛ్ చేయనున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నెల23 వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగును స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా ప్రేమ కథ నేపథ్యంలోనే తెరకెక్కనున్నట్టు తెలిపారు.

ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను కాశ్మీర్లో ప్లాన్ చేసి..అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చేయనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో ప్రజలను కాపాడే సోల్జెర్ గా విజయ దేవరకొండ కనబడనున్నాడు. ఈ సినిమాలో సమంత పాత్ర కాశ్మీరీ అమ్మాయిగా కనబడనుందని తెలిపారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ నటించడంతో అభిమానులకు ఆసక్తి నెలకొంది.