తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..

0
124

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మొదటి సినిమా అయినా ఏం పిల్లో ఏం పిల్లాడో మూవీతో మనకు పరిచయమయింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది, రభస వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకొని..తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది.

ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ లో వరుస సినిమాలతో బిజీ అయిపొయింది ఈ అమ్మడు. కానీ ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. కరోనా సమయంలో పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుపెట్టింది. నేడు ప్రణీత భర్త అయిన నితిన్ రాజు ది పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో విషెస్ తెలియజేసింది.

అంతేకాకుండా ఈరోజు నా జీవితంలో ఒక ప్రత్యేక రోజు అంటూ చెప్పుకొచ్చింది. తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రెగ్నెన్సీ టెస్టుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. తన భర్త పుట్టినరోజే తల్లి అవుతునందుకు ఆనందం వ్యక్తం చేసింది.