టాలీవుడ్ లో లేడీ గెటప్ లో అదరగొట్టిన మన స్టార్ హీరోలు వీరే?

టాలీవుడ్ లో లేడీ గెటప్ లో అదరగొట్టిన మన స్టార్ హీరోలు వీరే?

0
92

విభిన్న పాత్రలు చేస్తే ఆ నటుడికి ఎంతో పేరు వస్తుంది, ఇక హీరోలు కూడా పాత్ర డిమాండ్ చేస్తే కచ్చితంగా చేస్తారు, అయితే ఒక్కోసారి ఫైట్లు డ్యాన్స్ రొమాన్సే కాదు సరికొత్త గెటప్ లు వేయాలి, అందులో ఒకటి లేడీ గెటప్, ఇలా లేడీ గెటప్ వేసి ఆకట్టుకున్న హీరోలు ఉన్నారు.

మన టాలీవుడ్ లో కొందరు హీరోలు ఇలా లేడి గెటప్ లో అలరించారు, మరి వారు ఎవరు అనేది చూద్దాం.

కమలహాసన్- లోకనాయకుడు హీరో కమల్ హాసన్ ఆయన భామనే సత్య భామనే సినిమాలో బామ్మ పాత్రలో నటించారు, అంతేకాదు దశావతారం లో కూడా అలాంటి పాత్రలో నటించాడు ఆయన

ఇక చిరంజీవి . ఆయన చంటబ్బాయి సినిమాలోని ఒక పాటలో రకరకాల పాత్రలు పోషించి చిరు లేడి గెటప్లో కూడా కనిపిస్తాడు, ఇది ఎంతో మంచి పేరు తెచ్చింది…

నరేష్- చిత్రం భలారే విచిత్రం సినిమాలో నరేష్ లేడీ గెటప్ లో నటించారు, మంచి ఫేమ్ వచ్చింది.

రాజేంద్రప్రసాద్, కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆయన మేడమ్ సినిమాలో లేడీలెక్చరర్ పాత్ర పోషించారు.

బాలకృష్ణ:పాండురంగడు సినిమాలో సత్యభామ వేషం వేశారు బాలయ్య అందులో అద్బుతంగా ఆయన నటించారు

అలీ- కమెడియన్ గా తన ముద్ర వేశారు అలీ.. ఆయన పలు సినిమాల్లో లేడీ గెటప్ వేశారు
టాటా బిర్లా మద్యలో లైలా,చిరుత, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో నటించి నవ్వించారు.

విక్టరీ వెంకటేష్ — బాడిగార్డ్ సినిమాలో కొద్దిసేపు లేడి గెటప్ లో అలరించాడు వెంకీ.

అల్లు అర్జున్- బన్నీ తన తొలిచిత్రం గంగోత్రిలో లేడి గెటప్ చేశారు

చియాన్ విక్రమ్: మల్లన్న సినిమాలో విక్రమ్ లేడి గెటప్ లో కనిపిస్తాడు.

ఇలా చాలా మంది తమ నటనతో అభిమానులని అలరించారు.