టాలీవుడ్ లో మరో బయోపిక్ ఎవరిదంటే

టాలీవుడ్ లో మరో బయోపిక్ ఎవరిదంటే

0
99

మన తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కోలీవుడ్ లో కూడా బయోపిక్స్ హవా స్టార్ట్ అయింది, ఇప్పటికే పలువురు గొప్ప వ్యక్తులు రాజకీయ సినిమా ప్రముఖుల జీవితాలపై బయోపిక్స్ వచ్చాయి, మన తెలుగులో ఇవి మరింత ఎక్కువ వస్తున్నాయి, తాజాగా మరో బయోపిక్ రెడీ అవుతోంది.

భారత వెయిట్లిఫ్టింగ్లో పేరుపొందిన కరణం మల్లేశ్వరి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెలుగు తెరపై ఓ చిత్రం ఆవిష్కృతం కానుంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. కరణం మల్లేశ్వరి పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసి ప్రకటించింది.

ఒలింపిక్లో పతకాన్ని పొందిన మొదటి భారతీయ మహిళ. పాన్ఇండియన్ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది.అని నిర్మాణ సంస్థ ప్రకటించింది, ఈ సినిమాకి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ అందిస్తున్నారు..సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె అభిమానులు ఈ విషయం తెలిసి చాలా ఆనందంలో ఉన్నారు.