తెలుగులో మరో విషాదం అలముకుంది.. ప్రముఖ చలన చిత్ర దర్శకుడు కన్నుమూశారు, దీంతో టాలీవుడ్ లో విషాదం కమ్ముకుంది. టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సంసారం ఒక చదరంగం ఆడదే ఆధారంవంటి కుటుంబ కథా చిత్రాలతో అలరించిన ప్రముఖ దర్శకుడు విసు కన్నుమూశారు.
ఆయన ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్నారు, ఆయన వయసు 72 సంవత్సరాలు, ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, ఇక విసు టాలవుడ్ లో మంచి పేరు సంపాదించిన దర్శకుడు, అయితే ఆయక కిడ్నీ వ్యాధితో కొద్ది రోజులుగా బాధపడుతున్నారు.
నిన్న పరిస్థితి విషమించడంతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు… విసు అసలు పేరు మీనాక్షి సుందరం రామస్వామి విశ్వనాథన్….. 1945 జూలై 1న తమిళనాడులో జన్మించిన విసు దర్శకదిగ్గజం బాలచందర్ దగ్గర సహాయకుడిగా కెరీర్ ఆరంభించాడు. ఇక ఆయన పలు సినిమాల్లో నటించారు , అంతేకాదు రచయితగా పేరు గడించారు, ఇక పలు సీరియల్స్ లో కూడా ఆయన నటించారు, రాజకీయంగా చూస్తే ఆయన బీజేపీలో చేరి పార్టీకి సేవలు అందించారు.