టాలీవుడ్లో విషాదం సీనియర్ నటి కుమారుడు మరణం

టాలీవుడ్లో విషాదం సీనియర్ నటి కుమారుడు మరణం

0
83

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. . సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు హఠాత్తుగా గుండెపోటుతో శనివారం ఉదయం చనిపోయారు. ఆయన వయసు 36 ఏళ్లు .. భార్య, పిల్లలు ఉన్నారు.చెన్నైలోని అతడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. వాణిశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేశ్ కార్తీక్ ఆయన డాక్టర్ గా పని చేస్తున్నారు.

ఆయన అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తిచేశారు, ఆయనకు నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు, ఇక ఆయన భార్య కూడా వైద్యురాలే, ఆమె సావిత్రి మనవరాలి ఆస్పత్రిలో పని చేస్తోంది..ఊటీలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన.. ప్యాలెస్ పనుల నిమిత్తం చెంగల్పట్టుకు వెళ్లారని సన్నిహితులు వెల్లడించారు.

ఆ రోజు రాత్రి తన కుమారుడితో సరదగా గడిపిన వెంకటేశ్.. ఉదయం విగతజీవుడిగా మారారని సన్నిహితులు తెలిపారు. దీంతో వాణిశ్రీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది, తెలుగులో వాణిశ్రీ ఎన్నో చిత్రాలు నటించారు..1970,80వ దశకంలో తెలుగు చిత్ర సీమలో కథానాయికగా ఓవెలిగారు కళాభినేత్రి వాణిశ్రీ.