టాలీవుడ్ లో రెండు వివాహాలు చేసుకున్న హీరోలు వీరే

టాలీవుడ్ లో రెండు వివాహాలు చేసుకున్న హీరోలు వీరే

0
78

ఎవ‌రికి అయినా జీవితంలో వివాహం ఓ మ‌ధుర అనుభూతి, అయితే కొన్ని కొన్ని కార‌ణాల వ‌ల్ల వివాహం అయిన త‌ర్వాత మ‌రో వివాహం చేసుకున్న వారు ఉంటారు, అయితే సినిమా ప‌రిశ్ర‌మ‌లో కూడా ఇలాంటిస్టార్ హీరోలు ఉన్నారు, అయితే ఒక్కొక్క‌రిది ఒక్కోకార‌ణం, మ‌రి మ‌న హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎవ‌రు అనేది చూద్దాం.

నంద‌మూరి తార‌క‌రామారావు ముందు ఆయ‌న బసవతారకం ని వివాహం చేసుకున్నారు.. ఇక ఆమె మ‌ర‌ణం త‌ర్వాత లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు.

కమలహాసన్ మొదటి భార్య పేరు వాణి గణపతి.. త‌ర్వాత సారికను వివాహం చేసుకున్నాడు.. గౌతమితో సహజీవనం చేసాడు..

కృష్ణ‌ముందు ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు.. త‌ర్వాత విజ‌య‌నిర్మ‌ల‌ను వివాహంచేసుకున్నారు..

కృష్ణం రాజు మొదటి భార్య పేరు సీతాదేవి, ఒక కార్ యాక్సిడెంట్లో ఆమె మరణించింది. త‌ర్వాత ఆయ‌న శ్యామ‌లా దేవిని వివాహం చేసుకున్నారు.

నాగార్జున వివాహం దగ్గుబాటి లక్ష్మితో జరిగింది ముందు, త‌ర్వాత అమ‌ల ప‌రిచ‌యంతో విడాకులు ఇచ్చి అమ‌ల‌ని వివాహం చేసుకున్నారు

పవన్ క‌ల్యాణ్ మొదటి భార్య పేరు నందిని. త‌ర్వాత‌ రేణు దేశాయ్ ని 2009లో వివాహం చేసుకున్నాడు పవన్. త‌ర్వాత రష్యన్ నటి అన్నా లెజినోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు.

మంచు విద్యాదేవి మోహన్ బాబు మొదటి భార్య.. ఆమె మ‌ర‌ణం త‌ర్వాత విద్యాదేవి చెల్లెలు నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు

నటుడు శరత్ బాబు ముందు ర‌మాప్ర‌భ‌ని వివాహం చేసుకున్నారు త‌ర్వాత స్నేహలతను పెళ్లి చేసుకున్నారు త‌ర్వాత వారు విడిపోయారు.

నంద‌మూరి హ‌రికృష్ణ కూడా రెండు వివాహాలు చేసుకున్నారు, మొద‌టి భార్య ల‌క్ష్మీ నంద‌మూరి, త‌ర్వాత షాలిని ని వివాహం చేసుకున్నారు.