Tollywood Senior Actor Chalapathi Rao Original Name and family Details సీనియర్ నటుడు చలపతిరావు ఆదివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్నారు. చలపతిరావు అసలు పేరు తమ్మారెడ్డి చలపతిరావు. 1944 మే 8న కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని బల్లిపర్రులో గ్రామంలో మణియ్య, వియ్యమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే నాటకాలపై ఆసక్తి పెంచుకుని, స్నేహితులతో కలిసి వాటిని ప్రదర్శించేవారు. దానివల్ల చదువు సరిగా సాగలేదు. బాగా ఒడ్డు, పొడుగు ఉండటం వల్ల నాటకాల్లో కథానాయకుడిగా నటించేవారు. వందలాది నాటకాలు వేసిన ఆయన కొన్నేళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి పేరు సంపాదించుకున్నారు.
Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు, అసలు పేరు ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవే
-