టాలీవుడ్ టాక్ – దర్శకుడు శంకర్ – చరణ్ సినిమాలో మరో స్టార్ హీరో

టాలీవుడ్ టాక్ - దర్శకుడు శంకర్ - చరణ్ సినిమాలో మరో స్టార్ హీరో

0
102

ఆర్ ఆర్ ఆర్ – ఆచార్య ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక భారీ సినిమా

చేయనున్నారు… ఇక ఈ సినిమా కథపై ఇప్పటికే వర్క్ చేస్తున్నారు శంకర్…అయితే ఇది పాన్ ఇండియా చిత్రంగా రానుంది… ఇక సౌత్ ఇండియాలోనే కాదు ఇటు నార్త్ లో ముఖ్యంగా బాలీవుడ్ నుంచి కూడా కొందరు నటులని ఈ సినిమాలో తీసుకుంటారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఈ చిత్రంలో ఓ రోల్ కోసం కన్నడ స్టార్ హీరో సుదీప్ ను తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శంకర్ అతనికి కాల్ చేసి కథ చెప్పడం ఆయన కూడా ఒకే చేయడం జరిగింది అంటున్నారు… అయితే తాజాగా ఈ వార్త కన్నడ తెలుగు మీడియాలలో బాగా వినిపిస్తోంది.

 

సుదీప్ పాత్ర ఇందులో చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని ఇప్పటి వరకూ చేయని రోల్ ఆయనకు ఇస్తున్నారు అని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ రెండు చిత్రాలు ఒకే అయిన తర్వాత చరణ్ శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.