ఆ సినిమాకి రావురమేష్ రెమ్యునరేషన్ పై టాలీవుడ్ టాక్

Tollywood talk on Rao Ramesh Remuneration for the film

0
83

మన టాలీవుడ్ లో నటులకి కొదవ లేదు. చాలా మంది ఎంతో గొప్ప నటులు ఉన్నారు. ఏకంగా బాలీవుడ్ లో కూడా మన నటుల గురించి మాట్లాడతారు. ఇక ప్రతినాయకుడిగానే కాకుండా ఏ రోల్ అయినా పోషించేవారు చాలా మంది ఉన్నారు.
ఇక రావు రమేష్ నటిస్తున్నాడంటే చాలు ఆ సినిమాలో పంచ్ డైలాగ్లకు కొదవ ఉండదని అనుకుంటారు. ఆయన నటన డైలాగ్ డెలివరీ పంచింగ్ చాలా బాగుంటాయి.

ఇక దర్శకుడికి సినిమా కోసం ఏం కావాలో ఆయన మొత్తం నటనలో చూపిస్తారు. రావు గోపాలరావు లాంటి మహా నటుడి వారసత్వం ఉన్నా, తన నటనతో ఆయన పైకి వచ్చారు అనే చెప్పాలి. టాలీవుడ్ చిత్ర సీమలో పలు రకాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయన రెమ్యునరేషన్ గురించి ఓ వార్త వినిపిస్తోంది.

మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాయట్టు సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గీతా ఆర్ట్స్ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో రూపొందించేందుకు నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో పాత్ర కోసం రావురమేష్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. దీని కోసం కోటిన్నర రెమ్యునరేషన్ అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుందట. అందుకే ఇంత రెమ్యునరేషన్ అని టాక్ నడుస్తోంది. అయితే ఇది ఎంత వరకూ నిజమో తెలియదు కాని వార్తలు అయితే వినిపిస్తున్నాయి.