పెళ్ళిపై ఫోకస్ పెడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో..

0
109

సమంతను పెళ్ళి చేసుకొని..విభేదాలతో విడాకులు తీసుకొని ప్రస్తుతం నాగచైతన్య ఒంటరిగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతున్నాడు ఈ యంగ్ హీరో.

సమంతతో కూడా నటించిన సినిమాలు ఉన్నాయి. నాగచైతన్య ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రుతిహాసన్ తో, మజిలీ ఫిల్మ్ కో స్టార్ దివ్యా కౌశిక్‌తోనూ లవ్ ట్రాక్ నడిపినట్టు అప్పట్లో రూమర్స్ వినిపించాయి. అయితే తాజాగా పెళ్ళిపై నాగచెతన్య ఫోకస్ పెట్టునట్టు తెలుస్తుంది.

త్వరలో నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు నాగచైతన్య హీరోయిన్స్ మాత్రం అసలే వివాహం చేసుకోను అని చెప్పినట్టు టాక్ వినబడుతుంది. హీరోయిన్స్ ను కాకుండా వేరే ఇండస్ట్రీయేతర అమ్మాయి అయితే బాగుంటుందనే నాగచైతన్య ఆలోచిస్తున్నాడట. మరి ఈ విషయమై అక్కినేని కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.