Breaking News- టాలీవుడ్ యువ హీరో ఇంట విషాదం

Tollywood young hero house tragedy

0
68

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రోజుల వ్యవధిలో ఇద్దరు లెజెండ్స్ మనల్ని విడిచి వెళ్లిపోయారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూయగా.. తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత పద్మ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి లంగ్ క్యాన్సర్‌తో అకస్మాత్తుగా ప్రాణాలు విడిచారు. దీంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో ఉంది.

ఈ క్రమంలోనే ఓ యువ హీరో ఇంట ఊహించని విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ యువ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు మృతి చెందాడు. ఆయన తమ్ముడు రామాంజులు రెడ్డి బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో హీరో అబ్బవరం కిరణ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫస్ట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ చిత్రంతో టాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.