గర్భం తోనే నిశ్చితార్థం చేసుకున్న టాప్ హీరోయిన్..!!

గర్భం తోనే నిశ్చితార్థం చేసుకున్న టాప్ హీరోయిన్..!!

0
86

బ్రిటన్‌కు చెందిన మోడల్, నటి అమీ జాక్సన్ దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘2.0’లో వసీకరణ్‌కు రోబో అసిస్టెంట్ వెన్నెలగా నటించి మెప్పించారు. ఈమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించారు. ‘2.0’ తరవాత అమీ ఏ సినిమాను అంగీకరించలేదు. దీనికి ఒక కారణం ఉంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. పెళ్లికాకుండానే తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్‌ పనాయొటో ద్వారా ఆమె గర్భం దాల్చారు. ఈ విషయాన్ని మార్చి నెలలో సోషల్ మీడియా ద్వారా అమీ వెల్లడించారు.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో చాలాకాలంగా అమీ జాక్సన్ డేటింగ్‌లో ఉన్నారు. తాము పెళ్లికి సిద్ధమవుతున్నట్లు, నిశ్చితార్థం చేసుకున్నట్లు ఈ ఏడాది జనవరి 1న అమీ జాక్సన్ ప్రకటించారు. ఆ తరవాత బ్రిటన్ మదర్స్ డే రోజు తాను తల్లిని కాబోతున్నానని ప్రకటించి షాక్ ఇచ్చారు. తాను గర్భంతో ఉన్న ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు గర్భంతోనే ప్రియుడితో అధికారికంగా నిశ్చితార్థం చేసుకుని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

జార్జ్‌ పనాయొటో, అమీ జాక్సన్ నిశ్చితార్థ వేడుక లండన్‌లో ఆదివారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నిశ్చితార్థ వేడుకలో కాబోయే భర్తతో కలిసి అమీ జాక్సన్ డ్యాన్స్ కూడా చేశారు. ఈ వేడుక వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కాగా, వీళ్లిద్దరూ వచ్చే ఏడాది గ్రీస్‌లో పెళ్లిచేసుకోబోతున్నారని సమాచారం.