బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కి హోస్ట్ గా ఎన్టీఆర్ అదరగొట్టారు అనే చెప్పాలి, మొత్తానికి అసలు తెలుగులో బిగ్ బాస్ కు ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ముందు ఎన్టీఆర్ హోస్ట్ చేయడం అనేది అందరూ చెప్పేమాట, అయితే తర్వాత సీజన్లకు ఆయనని కోరినా ఆయన సినిమాలతో బిజీగా ఉండి హోస్ట్ గా చేయలేదు, అయితే ఆయన తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.
ఇలాంటి వేళ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఓ రియాల్టీ షో చేయనున్నారు అని వార్తలు వస్తున్నాయి, దీని కోసం భారీ రెమ్యునరేషన్ కూడా ఆయనకు ఇవ్వనున్నారట, సౌత్ ఇండియాలో ఇది అత్యంత భారీ రెమ్యునరేషన్ అని టాలీవుడ్ టాక్. కౌన్ బనేగా కరోడ్పతి షోకు తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించనున్నారట,.
ఇక ఈ షో మరో ఛానల్ లో రానుంది అని తెలుస్తోంది, ఇక నేమ్ – గేమ్ కూడా మారుస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ఇది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, మరి నిజంగా ఇది తారక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి,చూడాలి ఇంకా దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.