బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విషాదం

0
97

కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ “బింబిసార”.  ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

అయితే.. ఈ బింబిసారా ప్రీ ఈవెంట్ లో విషాదం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్ లో ఓ అభిమాని  అనుమాస్పద మృతి చెందాడు. అతని పేరు పుట్టా సాయి రామ్ గా సమాచారం అందుతోంది.

అతని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇక సంఘటన పై పోలీస్ ల విచారణ కొనసాగుతోంది. పుట్టా సాయిరామ్ ది ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గూడెం అని.. కూకట్పల్లి లో వుంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.