Breaking: సినీ ఇండస్ట్రీలో విషాదం..క్యాన్సర్ తో ప్రముఖ నటుడు మృతి

0
87

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ‘టైటానిక్’ చిత్రంలో బిల్లీ జేన్ సైడ్‌కిక్ స్పైసర్ లవ్‌జాయ్‌గా నటించిన డేవిడ్ వార్నర్ మృతిచెందాడు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న డేవిడ్ సోమవారం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఇతను ‘ది ఒమెన్’, ‘ట్రాన్’ వంటి చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇతని మరణ వార్త విన్న కొందరు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.