సినీ పరిశ్రమలో విషాదం..కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి

Tragedy in the film industry..Famous director dies with Corona

0
111

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులను కోల్పోయింది చిత్రపరిశ్రమ. అందులో నుండి తేరుకోకముందే కరోనా బారిన పడిన ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రాజు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రాగా.. కుటుంబ సభ్యులు ఆయనను బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు పేర్కొన్నారు.