Flash: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ నిర్మాత కన్నుమూత

0
98

చిత్రపరిశ్రమలో వరుస విషాదాలతో కనీసం కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా, వ్యక్తిగత కారణాల చేత మరణించగా..తాజాగా ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి కూడా మరణించడంతో టాలీవుడ్ చిత్ర సీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని మరణానికి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడమే కారణమని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు చేసుకుంటున్నారు.

రామకృష్ణారెడ్డిని చెన్నైలో ఓ ఆసుపత్రికి తరలించగా..ఆరోగ్య పరిస్ధితి విషమించి వైద్యులు చికిత్స చేస్తుండగా మరణించడం బాధాకరం. ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రొడ్యూస్ చేసిన రామకృష్ణారెడ్డి మరణవార్త విన్న సినిమాప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు .రామకృష్ణారెడ్డికి ఇద్దరు కుమారులుండగా వారి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.