Flash: సినీ ఇండస్ట్రీలో విషాదం..KGF నటుడు కన్నుమూత

0
85

ప్రస్తుతం వరుస విషాదాలతో సినీ ఇండస్ట్రీలో కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది  ప్రముఖ నటులు, దర్శకులు మరణించి ఎనలేని బాధను మిగిల్చారు. తాజాగా శాండిల్ వుడ్ నటుడు మోహన్ జూనేజా మృతి చెందడంతో చిత్ర పరిశ్రమలో తీరని విషాదం చోటుచేసుకుంది.

గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో బెంగుళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు చికిత్స చేస్తుండగా మరణించడం అందరిని కలచి వేస్తుంది. ఇతను కేవలం తెలుగు బాషలోనే కాకుండా  తమిళం, మలయాళం, హిందీ సినిమాలలో సైతం హాస్యనటుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పటికే 100 సినిమాలకు పైగా నటించిన ఘనత పొందాడు. తాజాగా సూపర్ హిట్ అందుకున్న కెజిఎఫ్ సినిమాలో కూడా తన హాస్యంతో అందరిని కడుపుబ్బా నవ్వించాడు. ప్రస్తుతం ఈయన మరణ వార్త తెలిసిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.