Breaking: సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత

0
78

ప్రస్తుతం వరుస విషాదాలతో సినీ ఇండస్ట్రీలో కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది  ప్రముఖ నటులు, దర్శకులు మరణించి ఎనలేని బాధను మిగిల్చారు. తాజాగా  సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు మరణించి చిత్రపరిశ్రమలో తీరని విషాదాన్ని మిగిల్చాడు.

గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తుదకు హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించడం అందరిని కలచివేస్తుంది. దాసరి పద్మకు సోదరుడి వరుస అయిన బోసుబాబు మరణవార్త విన్న సినీప్రముఖులు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈయన చాలా సినిమాలను ప్రొడ్యూస్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.