టాలీవుడ్ చిత్ర సీమలో విషాదం – నటి జయంతి కన్నుమూత

Tragedy in the Tollywood film world-Actress Jayanti death

0
64

టాలీవుడ్ చిత్ర సీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు తమిళ కన్నడ హింది సినిమాల్లో సుమారు 500 చిత్రాల్లో ఆమె నటించారు.

సీనియర్ ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వరరావు , కృష్ణ , కృష్ణం రాజు సినిమాల్లో నటించారు. చాలా మంది హీరోలకు తల్లిగా నటించారు ఆమె. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలకు తల్లిగా నటించి అలరించారు జయంతి. పెద్దరాయుడు సినిమాలో రజినీకాంత్ చెల్లిగా నటించి ఆకట్టుకున్నారు. ఇక కన్నడలో అనేక సినిమాలు చేశారు ఆమె.కన్నడ చిత్ర సీమలో రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి అగ్ర నటుల సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు.

ఆమె మరణంతో సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది . ఆమె కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారు చిత్ర సీమకు చెందిన వారు. కన్నడ ప్రభుత్వం అభినయ శారద అనే బిరుదు కూడా ఆమెకి ఇచ్చింది.