టాలీవుడ్ లో విషాదం

Tragedy in Tollywood

0
78

టాలీవుడ్‌ నిర్మాత మహేశ్‌ కోనేరు కన్నుమూశారు. ఈ ఉదయం విశాఖలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో తెలుగులో పలు చిత్రాలను ఆయన నిర్మించారు. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌కు మహేశ్‌ కోనేరు వ్యక్తిగత పీఆర్‌గా పని చేశారు. 118, తిమ్మరుసు, మిస్‌ ఇండియా చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతిపై తారక్ సంతాపం ప్రకటించారు.

“బరువెక్కిన గుండెతో మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. నా ప్రియమైన మిత్రుడు కోనేరు ఇక లేరన్న వార్త నన్ను షాక్​కు గురి చేసింది. చెప్పడానికి మాటలు రావట్లేదు. తన కుటుంబానికి, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా” అంటూ తారక్ ట్వీట్ చేశారు.

https://twitter.com/tarak9999