ఫ్లాష్: విషాదం..ప్లాస్టిక్ సర్జరీ వికటించి ప్రముఖ నటి మృతి

0
68

ప్రస్తుతం వరుస విషాదాలతో సినీ ఇండస్ట్రీలో కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది  ప్రముఖ నటులు, దర్శకులు మరణించి ఎనలేని బాధను మిగిల్చారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీ లో  ప్రముఖ టీవీ నటి చేతనా రాజ్ మృతిచెందడంతో సినీ ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ మృతికి కాస్మెటిక్ సర్జరీ వికటించడమే కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు.

ఫ్యాట్ ఫ్రీ కోసం చేతన్ రాజ్ కాస్మోటిక్ సర్జరీని చేసుకోవడంతో ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఇబ్బంది పడినట్టు వైద్యులు చెబుతున్నారు. ఆ ఆసుపత్రిలో ఐసియు లేకపోవడంతో పాటు వైద్యుల నిర్లక్షమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చేతన రాజ్ కన్నడ ఇండస్ట్రీలో పలు టీవీ షోస్, సీరియల్స్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు.