దసరాకి సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ దసరాకి కొత్త సినిమాలతో పాటు విడుదల అయ్యే సినిమాలు కూడా ఉన్నాయి. ఇక స్టార్ హీరోలు తమ కొత్త ప్రాజెక్టులని కూడా అనౌన్స్ చేస్తారు. అయితే నందమూరి ఫ్యాన్స్ కు ఆరోజు త్రిపుల్ ట్రీట్ అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు. ఎందుకు అంటే బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను దసరాకు విడుదల ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం దసరాకు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మరో ట్రీట్ సరికొత్తగా ఉండనుందట. డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు బాలయ్య ఇప్పటికే డిస్కషన్స్ కూడా అయ్యాయి అని తెలుస్తోంది. అయితే దసరాకు ఈ సినిమా నుంచి కూడా ఓ అదిరిపోయే అప్డేట్ రాబోతోందని తెలుస్తోంది. ఇలా దసరా రోజు త్రిఫుల్ ట్రీట్ అని బాలయ్య ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు.