మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు, ఈ సినిమా తర్వాత లూసిఫర్ ను సెట్స్ పై పెట్టనున్నారు అనే విషయం తెలిసిందే, అయితే మలయాళ సూపర్ హిట్మూవీ లూసిఫర్ రీమేక్లో పాత్రకుగాను సీనియర్ నటి త్రిష ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి, అయితే ముందుగా ఇందులో నయనతార నటిస్తుంది అని వార్తలు వచ్చాయి, తాజాగా ఆమె కాదని త్రిష నటిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో మెగాస్టార్ సూపర్ హిట్ స్టాలిన్ సినిమాలో జోడీగా నటించింది త్రిష, తాజాగా మరోసారి ఆయనతో నటిస్తుంది అని తెలుస్తోంది, ఇక దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది ఇప్పటికే స్టోరీ లైన్ ఆమెకి వినిపించారు అని కోలీవుడ్ టాక్ .
ఇక ఆచార్య వర్క ఫినిష్ చేసుకుని వచ్చే నెల మార్చి 10 నుంచి ఈ సినిమా షూటింగ్ జరుపుతుకుంటుంది అని వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే చిత్ర టీమ్ మొత్తం నటులని ఎంపిక చేస్తున్నారట..హీరో అనుచరుడి పాత్రలో హీరో సత్యదేవ్ నటించనున్నారు.. అయితే చెల్లి పాత్ర ఇందులో త్రిష పోషిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.