త్రివిక్రమ్ మ్యారేజ్ లో ఎన్నో ట్విస్టులు — అతని భార్య ఎవరో తెలుసా

త్రివిక్రమ్ మ్యారేజ్ లో ఎన్నో ట్విస్టులు -- అతని భార్య ఎవరో తెలుసా

0
89

మన టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా వస్తోంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎదురుచూస్తారు, మనసుకి హత్తుకునే సింపుల్ పదాలతో ఆయన సంభాషణలు రాస్తారు ,అదే ఆయనకు ప్లస్ అయింది, అందుకే ఆయనని మాటల మాంత్రికుడు అంటారు, అయితే ఆయన కుటుంబాన్ని పెద్దగా సినిమా వేడుకలకి తీసుకురారు.. కాస్త ప్రైవసీగానే ఉంచుతారు. మీడియాలో వార్తలకి పెద్దగా ఆయన గురించి స్కోప్ ఇవ్వరు.

ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే, త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య,ఆమె ప్రముఖ పాటల రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రీ సోదరుడి కుమార్తె, ఇక వారి వివాహం చాలా ట్విస్టులతో జరిగిందట. ముందుగా సౌజన్య అక్క పెళ్లికి ఉంది .. ఆమెని చూడటానికి త్రివిక్రమ్ పెళ్లి చూపులకి వెళ్లారు.. కాని ఈ సమయంలో సౌజన్యని చూసి ఆమెని పెళ్లి చేసుకుంటా అని చెప్పారు.

ఇక అబ్బాయి మంచి వ్యక్తి కావడం సినిమాల్లో మంచి అవకాశాలు రావడంతో త్రివిక్రమ్ తో సౌజన్యను ఇచ్చి వివాహం చేసేందుకు ఒప్పుకున్నారు, కాని పెద్ద కుమార్తె వివాహం అయ్యాక పెళ్లి చేస్తాము అని చెప్పారట, ఒక సంవత్సరం తర్వాత వీరి పెళ్లి జరిగింది…అలాగ వీరి వివాహం జరిగింది. .ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.