త్రివిక్రమ్ అన్ని సినిమాలు అ అక్షరంతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు

త్రివిక్రమ్ అన్ని సినిమాలు అ అక్షరంతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు

0
100

త్రివిక్రమ్ సినిమాలు అంటేనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎక్కువ ప్యాక్ చేసి ఉంటాయి.. సినిమా చూసి వస్తే బంధాలు అనుబంధాలని గుర్తుచేస్తాయి, తండ్రి కొడుకులు అత్త అల్లుడు ఇలా బంధాలపై ఆయన సినిమా కాన్సెప్ట్ లు నడుస్తాయి ప్రజలకు కూడా బాగా దగ్గర చేస్తాయి.

అయితే త్రివిక్రమ్ గత సినిమాల టైటిల్స్ చూస్తుంటే అ అనే కాన్సెప్ట్ పట్టుకున్నారు, అసలు టైటిల్ కచ్చితంగా అ తో స్టార్ట్ అయ్యేలా చేస్తున్నారు.. త్రివిక్రమ్ కెరీర్ మొదట్లో అతడు అందులో అ అనే అక్షరం పెట్టాడు. ఆ తర్వాత అత్తారింటికి దారేది అజ్ఞాతవాసి, అరవింద సమేత. వీర రాఘవ. ఇప్పుడు అల వైకుంఠపురములో అంటూ వచ్చాడు.

ప్రతీసారి అ అనే అక్షరంతో వస్తున్న సినిమాలు దాదాపు విజయం సాధిస్తుండటంతో ఇపుడు ఎన్టీఆర్తో చేయబోయే సినిమాకు అ అక్షరంతో మొదలయ్యే అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఖరారు చేశారట, అయితే కేవలం సినిమా హిట్ అవుతుంది అనే ఉద్దశంతో ఆయన అ అనే అక్షరంతో సినిమా టైటిల్ స్టార్ట్ చేస్తున్నారు అని కొందరు అంటున్నారు, కాని దీని వెనుక ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది. ఈసారి కచ్చితంగా అది తెలుసుకుంటాం అంటున్నారు సినీ విశ్లేషకులు.